వరంగల్ లో రౌడీషీటర్లతో రోడ్డుపై పరేడ్ చేయించిన పోలీసులు

  • ఖిల్లా వరంగల్ తహసీల్దారు కార్యాలయం వరకు నడిపించిన పోలీసులు
  • తహసీల్దారు సమక్షంలో రౌడీ షీటర్ల బైండోవర్
  • మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవాతు
తెలంగాణలోని వరంగల్ జిల్లా కేంద్రంలో పోలీసులు రౌడీ షీటర్ల ఆట కట్టిస్తున్నారు. రౌడీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏజే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఆ రౌడీ షీటర్లను ఖిల్లా వరంగల్ తహసీల్దారు కార్యాలయం వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకుపోయారు. అనంతరం తహసీల్దారు సమక్షంలో వారిని బైండోవర్ చేశారు.

కమిషనరేట్ పరిధిలో మొత్తం మొత్తం 764 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఈస్ట్ జోన్ పరిధిలో 275, వెస్ట్ జోన్ పరిధిలో 158, సెంట్రల్ జోన్ పరిధిలో 331 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించారు. రౌడీ షీటర్ల ప్రవర్తనను బట్టి పోలీసులు వారిని మూడు విభాగాలుగా విభజించారు.

ఎవరిపై ఎలా నిఘా ఉంచాలో పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఇటీవలి కాలంలో రౌడీషీటర్ల వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులు వారందరినీ పిలిపించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండుటెండలో రోడ్డుపై కవాతు చేయించారు. రౌడీషీటర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు.

Warangal Police
Telangana Police
Rowdy sheeters
Warangal
Crime control
Police parade
Bindover

More Telugu News